kokila kokila ku annadhi lyric-pellichesukundam-singer K S Chithra,S.P.Balasubramanyam Lyrics - K S Chithra,S.P.Balasubramanyam
| Singer | K S Chithra,S.P.Balasubramanyam |
| Composer | Koti |
| Music | Koti |
| Song Writer | Sri Sai Kiran |
Lyrics
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో ॥
చరణం : 1
గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మజన్మలందు నీడ కావా
లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా ॥
చరణం : 2
వాలు కళ్లతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళపాళలు ఏలనమ్మా
వీలులేనిదట్టులేదులేమ్మా
మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం
కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కలలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మా ॥
Comments
Post a Comment